ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ.. ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు తెలిపిన కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్
ఘట్‌కేసర్, అక్టోబర్ 10 (ప్రజావాణి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ఆడపడుచుల జీవితాల్లో ఆనందాన్ని నింపే పూల పండుగ అని ఘట్‌కేసర్ మాజీ వార్డు కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్ పేర్కొన్నారు. ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో బతుకమ్మ పండుగ సందడి నెలకొన్న నేపథ్యంలో మహిళలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పల్లెలకు, పట్టణాలకు కొత్త అందాలను తీసుకొచ్చే బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే గొప్ప సంప్రదాయమని అన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ...