ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. దుర్గాదేవిని దర్శించుకున్న మాజీ కౌన్సిలర్ కొమ్మగోని మహిపాల్, రామాదేవి
ఘట్‌కేసర్, అక్టోబర్ 18 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో బతుకమ్మ వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కొమ్మగోని మహిపాల్, రామాదేవి వేడుకల్లో పాల్గొని దుర్గాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతిరూపమని పేర్కొన్నారు. పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ మహిళలు పాటలు పాడుతూ, ఆటపాటలతో ఉత్సాహంగా...