ఎనిమిదవ రోజు శ్రీ భవానీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారు

మేడ్చల్ శ్రీ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎనిమిదవ రోజు శ్రీ భవానీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారు మేడ్చల్: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మేడ్చల్ పట్టణంలోని శ్రీ గడి మైసమ్మ తల్లి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు అమ్మవారు శ్రీ భవానీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తూ భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు....