ఎదులాబాద్‌లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు… ఇందిరమ్మ చీరలు ధరించి సంప్రదాయ ఆటపాటలతో సందడి చేసిన మహిళలు

ఘట్‌కేసర్, అక్టోబర్ 10 (ప్రజావాణి):మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్‌లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, యువతులు అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇందిరమ్మ చీరలు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి సంప్రదాయ గీతాలు ఆలపిస్తూ ఆటపాటలతో సందడి చేశారు. వివిధ రకాల పూలతో ఆకర్షణీయంగా అలంకరించిన బతుకమ్మలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలంతా ఒకచోట చేరి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ...