ఎత్తొండ సహకార సంఘంలో కొలువుదీరిన నూతన పాలకవర్గం.
పీఏసీఎస్ చైర్మన్‌గా కోనేరు వెంకట సుబ్బారావు ప్రమాణ స్వీకారం.
చైర్మన్‌తో పాటు 12 మందికి ప్రమాణం చేయించిన పర్సనల్ ఇన్ ఛార్జ్ రియాజుద్దీన్.
రైతుల సంక్షేమమే మా ప్రథమ కర్తవ్యమన్న నూతన చైర్మన్.


కోటగిరి/ప్రజావాణి:-రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడమే తమ ప్రథమ కర్తవ్యమని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎత్తొండ నూతన చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావు పేర్కొన్నారు.నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కోటగిరి మండలం ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గం మంగళవారం అట్టహాసంగా కొలువు దీరింది.సంఘ చైర్మన్‌గా కోనేరు వెంకట సుబ్బారావుతో పాటు మరో 12 మంది పాలకవర్గ సభ్యులతో సంఘం పర్స న్ ఇన్ ఛార్జ్ రియాజుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించా రు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సంఘం నూతన చైర్మన్‌తో పాటు పాలకవర్గ సభ్యులుగా కమలావార్ వెంకటేష్,మన్నె సాయిలు,అగ్గు హనుమంతు, మేతరి లస్మవ్వ,బొనిగే శ్యాంసుందర్,ఆలపాటి లక్ష్మి,జి. సరస్వతి,జి.తుక్కమ్మ,ఆర్.రాధిక,బోధన్ ఆనంద్,ఎం. ఫణికుమార్,హెచ్.అశోక్ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా సంఘం పరిధిలోని సర్పంచులు,ప్రజాప్రతినిధు లు,నాయకులు,సహకార సంఘం సిబ్బంది నూతన పాలక వర్గానికి శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం గత కొంతకాలంగా సంఘం పర్సనల్ ఇన్ ఛార్జ్‌గా సేవలందించిన రియాజుద్దీన్‌ను నూతన పాలకవర్గ సభ్యులు శాలువా, పూలమాలలతో సత్కరించారు.ఈ సందర్భంగా నూతన చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ.రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే నమ్మకంతో మా పాలక వర్గం పనిచేస్తుంది అని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఆనంద్ మాట్లాడుతూ.సంఘం ద్వారా రైతులకు కాలానికి అనుగుణంగా అందవలసిన రుణాలు, ఎరువులు,విత్తనాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా పంపిణీ చేయాలన్నారు.అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.బాన్సువాడ ఎమ్మెల్యే,రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి అండదండలతో ఎత్తొండ సహకార సంఘాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి లాభాల బాటలో నడిపించాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సంఘ పరిధిలోని సర్పంచులు రొట్టె పుష్పభాయి విఠల్,ఎస్.కె.గౌస్,గైని వీరమణి అర్జున్,బి.అనిత చందు,ప్రజాప్రతినిధులు,సంఘ సభ్యులు,రైతులు,సంఘ సిబ్బంది పాల్గొన్నారు.