prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 7:46 pm Digital Edition : PRAJA VANI

ఎంపీడీవో ఆఫీస్ లో బతుకమ్మ సంబరాలు

ఎంపీడీవో ఆఫీస్ లో బతుకమ్మ సంబరాలు
ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ఎంపీడీవో సింగారపు కుమార్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక తహసిల్దార్ చందా నరేష్,ఏపిఎం నరేంద్ర కుమార్, సీనియర్ అసిస్టెంట్ నరసింగరావు బతుకమ్మ వేడుక కు హాజరయ్యారు. ఈ ఉత్సవాల లో ఎంపీడీవో కార్యాలయ, సెర్ఫ్(ఐకెపి) ఉద్యోగులు, ఉపాధి సిబ్బంది తీరొక్క పువ్వులను సేకరించి బతుకమ్మలను రంగుల గోపురాల్లా పేర్చి సౌండ్ బాక్స్ ల హోరులో బతుకమ్మ పాటల తో ఆడి పాడారు.ఈ సందర్భంగా తహసిల్దార్ నరేష్, ఎంపీడీవో సింగారపు కుమార్ బతుకమ్మ పండుగ విశిష్టతను వివరిస్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని, ప్రకృతిని,స్త్రీ శక్తిని,జీవన విధానాన్ని ఆరాధించే పూల పండుగ అని తెలిపారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.