prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 12:48 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

ఎండపల్లిలో ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం: విద్యుత్ షాక్‌తో మంటలు చెలరేగినట్లు అనుమానం

ఎండపల్లి మండల కేంద్రంలో ఉపసర్పంచ్ దాసరి కళ్యాణి కొమరయ్యల నివాస గృహం విద్యుత్ షాక్‌తో ప్రమాదవశాత్తు దగ్దమైనట్లు సంచారం. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. కుటుంబసభ్యులు అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. పోలీసులు, అధికారులు ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.