prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 7:58 pm Digital Edition : PRAJA VANI

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి శుభాకాంక్షలు తెలిపిన నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షుడు న్యాయవాది మోహీద్ పటేల్

*ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి శుభాకాంక్షలు తెలిపిన*

*నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షుడు న్యాయవాది మోహీద్ పటేల్* .

నారాయణఖేడ్, అక్టోబర్ 16, (ప్రజావాణి)

ఎంఐఎం అధినేతగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ ఎంపీ, బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీని నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షుడు, న్యాయవాది మోహీద్ పటేల్ హైదరాబాద్‌లోని ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో కలిసి శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా నారాయణఖేడ్‌లో ఎంఐఎం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం పనిచేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ,నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షుడు న్యాయవాది మోహీద్ పటేల్‌కు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు షేక్ అమ్జద్, అబ్దుల్ జబ్బార్, ముజీబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.