prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 3:17 pm Digital Edition : PRAJA VANI

ఎంఈఓ సేవలు మరువలేనివి

ఎంఈఓ సేవలు మరువలేనివి

అనంతపురం ప్రజావాణి అక్టోబర్ 13 అన్ని దానాల్లో కన్నా విద్యా దానం చాలా గొప్పది అంటారు అందులో సరస్వతీపుత్రుడుగా రాణించాలంటే ఎంతో నైపుణ్యం చేసుకుంటే గాని దక్కని వరం ఉపాధ్యాయునిగా మెలగాలంటే ఎంతో నైపుణ్యం కృషి పట్టుదల చాలా అవసరం, ఎప్పుడో నవ్వుతూ ఉత్సాహంగా ఏ పనిలోనైనా ముందంజలో ఉండటానికి ప్రయత్నిస్తూనే వచ్చారు ఈ లక్షణాలన్నీ కలగలిపిన ఉన్న వ్యక్తిత్వంగ కలిగిన ఎవరైనా ఉన్నారంటే మండల విద్యాధికారిగా పనిచేస్తున్న ఈశ్వరప్ప అని సగౌరవంగా చెప్పుకోవచ్చని మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కొనియాడారు ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ ఒక రైతు కుటుంబంలో జన్మించి ఉన్నతమైన శిఖరాలను అందుకోవాలని దృఢమైన సంకల్పంతో ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉపాధ్యాయునిగా తనదైన శైలిలో పిల్లలకు విద్యను బోధించడంలో తనకు తానే స్ఫూర్తిదాయకంగా ఎదుగుతూ వచ్చారన్నారు. అంతేకాకుండా మచ్చలేని ఉపాధ్యాయుడిగా పనిచేసే తోటి వారి కంటే ముందుగానే పదోన్నతి పై ప్రధాన ఉపాధ్యాయుడుగా ఎదుగుతూ వచ్చారని అనేక సందర్భాలలో ప్రధానోపాధ్యాయులు కూడా చర్చించుకోవడం జరిగిందన్నారు
ఆయన పని చేసిన ప్రతి హై స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులు పాటు తోటి ఉపాధ్యాయులు ఎంతో సోదరా బావంగా పనిచేశారని ఏ చిన్న సమస్యలు వచ్చినా నేనున్నానంటూ ధైర్యం చెప్పి ముందుకు సాగే స్వభావం గల వ్యక్తిని తెలిపారు గతంలో ఎంఈఓ మల్లికార్జున బదిలీ అయిన సమయంలోఅ స్థానంలో సీనియర్ ప్రధాన ఉపాధ్యాయులు ఎందరో ఉండగా రాకెట్ల హై స్కూల్ నందు హెచ్ఎం గా పనిచేస్తున్న సమయంలో ఎంఈఓ గా బాధ్యతలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు బాధ్యతలు చేపట్టిన రోజు నుండి నేటి వరకు మచ్చలేని చంద్రుడిగా రాబోయే రోజుల్లో మరింత ఎత్తుకు ఎదగాలని పలువురు అధ్యాపకులు కోరుకుంటున్నారు.