prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 8:03 pm Digital Edition : PRAJA VANI

ఊరి కోసం ఒక్కరోజు

ఊరి కోసం ఒక్కరోజు

ప్రజావాణి అక్టోబర్ 3 కమలాపూర్ మండల్ కేంద్రంలో మన ఊరు పరిశుభ్రత మన బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఝాన్సీ రాణి
కమలాపూర్ గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్ వార్డ్ మెంబర్ జన్ను బిక్షపతి మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న గ్రామ పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కమలాపూర్ ఎస్సీ కాలనీలో 14వ వార్డులో ఝాన్సీ రాణి పాల్గొని సైడ్ కాలవలను రోడ్లను పరిశుభ్రం చేయనైంది ఈ సందర్భంగా ఝాన్సీ రాణి మాట్లాడుతూ మన ఊరి పరిశుభ్రత మనందరి బాధ్యత అని మన ఒంటిని మనం ఇంటిని శుభ్రపరచుకున్నట్లే మన గ్రామాన్ని కూడా స్వచ్ఛందంగా అందరూ ముందుకు వచ్చి రోడ్ల పైన ఉన్న చెత్తను పేరుకుపోయిన సైడ్ కాలువలను గాని శుభ్రపరిస్తే దోమల వల్ల వచ్చే మలేరియా బోదకాలు వంటి జబ్బులను నియంత్రించవచ్చునని మన ఊరు కూడా అందంగా తయారవుతుందని ఇది ఒక గ్రామ పంచాయతీ సిబ్బంది బాధ్యతలే విషయాన్ని పక్కనపెట్టి మన అందరి బాధ్యతగా తీసుకుంటే మన ఊరు బాగుంటుందని మా దేశంలోనే ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గాలు స్వచ్ఛందంగా సంస్థలు యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారానికి ఒకరోజు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటే మన దేశమే బాగుంటుందని తెలిపినారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాట్ల రమేష్ జెఎసి చైర్మన్ మౌటం సంపత్ వార్డు మెంబర్లు పుల్ల ఐలయ్య పుల్ల శ్రీనివాస్ మార్క అశోక్ తిరుపతి రాజయ్య గంధసిరి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు