ఉమ్మడి నల్గొండ జిల్లా క్రికెట్‌ జట్టుకు కోదాడ క్రీడాకారిణి వర్షిని

అండర్‌-17 బాలికల జట్టులో చోటు.. బౌలింగ్‌ ప్రతిభతో సెలెక్టర్లను ఆకట్టుకున్న వైనం *కోదాడ, అక్టోబర్‌ 04(ప్రజావాణి)*: కోదాడ క్రికెట్‌ అకాడమీకి చెందిన యువ క్రీడాకారిణి సోంపంగు వర్షిని ఉమ్మడి నల్గొండ జిల్లా అండర్‌-17 బాలికల క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అండర్‌-17 బాలికల క్రికెట్‌ టోర్నమెంట్‌లో వర్షిని ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది.ఆదివారం మిర్యాలగూడలోని క్లియో గ్రౌండ్‌లో...