prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 6:39 am Digital Edition : MEERASAHAB CHILUKUR

ఉమ్మడి నల్గొండ జిల్లా క్రికెట్‌ జట్టుకు కోదాడ క్రీడాకారిణి వర్షిని

అండర్‌-17 బాలికల జట్టులో చోటు.. బౌలింగ్‌ ప్రతిభతో సెలెక్టర్లను ఆకట్టుకున్న వైనం

*కోదాడ, అక్టోబర్‌ 04(ప్రజావాణి)*: కోదాడ క్రికెట్‌ అకాడమీకి చెందిన యువ క్రీడాకారిణి సోంపంగు వర్షిని ఉమ్మడి నల్గొండ జిల్లా అండర్‌-17 బాలికల క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అండర్‌-17 బాలికల క్రికెట్‌ టోర్నమెంట్‌లో వర్షిని ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది.ఆదివారం మిర్యాలగూడలోని క్లియో గ్రౌండ్‌లో నిర్వహించిన టోర్నమెంట్‌-కం-సెలక్షన్స్‌లో వర్షిని సూర్యాపేట జిల్లా జట్టు తరఫున పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శనతో సెలెక్టర్లను ఆకట్టుకుని జిల్లా జట్టులో చోటు దక్కించుకుంది.తన ప్రతిభ, క్రమశిక్షణ, పట్టుదలతో మెరుగైన ప్రదర్శన కనబరిచిన వర్షిని ఎంపిక కావడంపై కోదాడ క్రికెట్‌ అకాడమీ క్రీడా వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.కోదాడ క్రికెట్‌ అకాడమీ కోచ్‌ షేక్‌ అబూబకర్‌ సిద్దిఖ్‌ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి రాష్ట్రస్థాయికి తీసుకెళ్లడమే తమ అకాడమీ లక్ష్యమన్నారు. వర్షిని తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకుని రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఉత్తమంగా రాణించాలని ఆకాంక్షించారు.కోదాడ నుంచి రాష్ట్రస్థాయికి మరో అడుగు.. వర్షిని బౌలింగ్‌ ప్రతిభకు ఇది గర్వకారణమైన గుర్తింపు అని కోచ్‌ పేర్కొన్నారు. వర్షిని ఎంపిక పట్ల అకాడమీ నిర్వాహకులు, కోచ్‌లు, క్రీడాకారులు, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.