prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 9:29 pm Digital Edition : PRAJA VANI

ఉద్యోగాల పేరుతో మోసం చేసిన రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

ఉద్యోగాల పేరుతో మోసం చేసిన రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి..

మీ ఓటుతోనే ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి –

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 28(ప్రజావాణి): జిల్లా లోని
దేవరుప్పుల మండల కేంద్రంలో అక్షర గార్డెన్‌లోబుధవారం నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు, సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ..
“అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఆయుధం. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.
ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలని, రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలనన్నారు.
ఉద్యోగాల పేరుతో మోసం చేసిన రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని,. నిరుద్యోగులకు ఉద్యోగాలు, యువతకు ఉపాధి, రైతులకు సాగునీరు, ప్రజలకు సంక్షేమం అందించడంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు ఎంతవరకు జరిగిందో ప్రజలు ప్రశ్నించాలన్నారు.
ప్రశ్నించే గొంతుకకు ఓటే బలం. ప్రభుత్వ పనితీరును అంచనా వేసి, ప్రజాసమస్యలపై తమ అభిప్రాయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యక్తం చేసే అవకాశం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కల్పిస్తాయని,

పట్టభద్రులందరూ ఓటరు నమోదుపై నిర్లక్ష్యం చేయకుండా, అర్హులైన ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువులో తమ పేరును నమోదు చేసుకోవాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించి నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టాలన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. పట్టభద్రుల సమస్యలను మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలంగా వినిపించేలా ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి” అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పల్లా సుందర్ రామిరెడ్డి, మండల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీ పార్టీ కార్యకర్తలు, పట్టభద్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.