prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 8:26 pm Digital Edition : PRAJA VANI

ఈ వి ఎం గోదాము వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు

ఈ వి ఎం గోదాము వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

*మన ప్రజావాణి*
     మంచిర్యాల జిల్లా:-
                
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన గోదాము వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల ఈ వి ఎం గోదామును ఎన్నికల విభాగం అధికారులతో కలిసి సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాము వద్ద పోలీసు సిబ్బంది సమన్వయంతో పటిష్టమైన బందోబస్తు చేపట్టడంతో పాటు 24 గంటలు సి.సి. కెమెరాల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. భద్రత సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..