prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 11:39 am Digital Edition : PRAJA VANI

ఈ నెల 28న ఐఎఫ్‌డబ్ల్యూజే 76వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

ఈ నెల 28న ఐఎఫ్‌డబ్ల్యూజే 76వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

కూకట్‌పల్లి : అక్టోబర్ 27 (ప్రజావాణి):

ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌డబ్ల్యూజే) 76వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఈ నెల 28వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు కట్టెల మల్లేష్, కార్యదర్శి గడ్డమీది అశోక్ తెలిపారు.

జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలం సూరారంలోని అంబేద్కర్ భవన్‌లో ఉదయం 10 గంటలకు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

1950 అక్టోబర్ 28న ఢిల్లీలో సీనియర్ పాత్రికేయుల ఆధ్వర్యంలో ఐఎఫ్‌డబ్ల్యూజే ఆవిర్భవించిందని, అప్పటి నుంచి దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం సంస్థ కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

జిల్లాలోని జర్నలిస్టులు, పాత్రికేయ సంఘాల ప్రతినిధులు, నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది.

ఇట్లు:
టీడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కమిటీ