prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 5:20 pm Digital Edition : SHEKARREDDY PATANCHERUV

ఈర్ల నితీష్ శ్రీకాంత్ చొరవతో రోడ్డు పనులకు శ్రీకారం

ఈర!

సృజన లక్ష్మీనగర్ ఫేజ్-4లో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారంతో కాలనీవాసుల హర్షం

అమీన్పూర్, అక్టోబర్ 25 (ప్రజావాణి): బీరంగూడ డివిజన్ పరిధిలోని పటేల్‌గూడ సృజన లక్ష్మీనగర్ ఫేజ్-4 కాలనీలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు పటేల్‌గూడ మాజీ సర్పంచ్ ఈర్ల నితీష్ శ్రీకాంత్ శంకుస్థాపన చేశారు. ఏళ్ల తరబడి సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీవాసుల సమస్యకు పరిష్కారం లభించనుంది. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని, ముఖ్యంగా వర్షాకాలంలో రహదారి బురదమయంగా మారడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యేవని తెలిపారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారం, అమీన్‌పూర్ మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్ ముదిరాజ్ ప్రత్యేక చొరవ, పటేల్‌గూడ మాజీ సర్పంచ్ ఈర్ల నితీష్ శ్రీకాంత్ నిరంతర కృషి ఫలితంగా తమ కాలనీకి సీసీ రోడ్డు మంజూరు కావడం సంతోషకరమన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే ఏళ్ల నాటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతోపాటు ప్రజల రాకపోకలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. కాలనీ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతూ సీసీ రోడ్డు నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ ఈర్ల నితీష్ శ్రీకాంత్‌లకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.