prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 7:47 pm Digital Edition : PRAJA VANI

ఈటలను కలిసిన మండల బిజెపి తోట

ఈటలను కలిసిన మండల బిజెపి తోట
ప్రజావాణి,నెల్లికుదురు:భారతీయ జనతా పార్టీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ను బీజేపీ నెల్లికుదురు మండల నాయకులు తోట రమేష్ ఆధ్వర్యంలో మండలంలోని నైనాల గ్రామానికి చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మండలం మండలంలోని పలు అంశాలు సమస్యల పై చర్చించారు.పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యలు తదితర అంశాలపై నాయకులు ఈటలతో మాట్లాడారు.పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయి నుంచి మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తోట రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆకుల లింగయ్య,బూత్ అధ్యక్షుడు తోట సురేష్,దాసరి శేఖర్,ఏర్పుల మధు పాల్గొన్నారు.