ఇసుక బకాసురులకు అండగా అధికారులా
ఇసుక బకాసురులకు అండగా అధికారులా? విచ్చలవిడిగా ఇసుక దందా.. అడ్డుకట్ట వేయాలి: సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ భూపాలపల్లి జిల్లా మన ప్రజావాణి : టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లోని చలివాగు పరివాహక గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతోందని సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో చలివాగుల్లో నుంచి పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తూ కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండటంతో పాటు వర్షాలు లేకపోవడంతో...