ఇప్పాయిపల్లిలో ఘనంగా సామూహిక కుంకుమార్చన
ఇప్పాయిపల్లిలో ఘనంగా సామూహిక కుంకుమార్చన పరిగి /కుల్కచర్ల అక్టోబర్ 19(ప్రజావాణి ) వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం, కుల్కచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన ఏంకంటి నరసమ్మ బాలయ్య గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చనలు చేసి తమ...