prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 4:47 pm Digital Edition : PRAJA VANI

ఇప్పాయిపల్లిలో ఘనంగా సామూహిక కుంకుమార్చన

ఇప్పాయిపల్లిలో ఘనంగా సామూహిక కుంకుమార్చన

పరిగి /కుల్కచర్ల అక్టోబర్ 19(ప్రజావాణి )

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం, కుల్కచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు.
గ్రామానికి చెందిన ఏంకంటి నరసమ్మ బాలయ్య గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చనలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం, పండుగ శోభ సంతరించుకుంది.
హాజరైన ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ బొలుసని భీమిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, కృష్ణారెడ్డి దొర, కుల్కచర్ల ప్రభుత్వ వైద్యాధికారి కిరణ్ కుమార్ గౌడ్, స్థానిక సర్పంచ్ ఎర్రం పోటీ మల్లేష్, ఉప సర్పంచ్ వడ్డే లక్ష్మమ్మ వెంకటయ్య పాల్గొన్నారు.
అలాగే మాజీ ఎంపీటీసీలు మాలే కృష్ణయ్య గౌడ్, ఆనందం పట్లోళ్ల వెంకట్రాంరెడ్డి, సీనియర్ నాయకులు తమ్మలి రామచంద్రయ్య, కుమ్మరి స్వామి, ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింలు, కుల్కచర్ల మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటయ్య గౌడ్, అచ్చనోళ్ల శ్రీనివాస్ గౌడ్, బాల్ రెడ్డి, జి. ఆనంద్, రఘుగౌడ్, నీల రాఘవేందర్, మధు, జగన్, శ్రీనివాస్, మల్లేష్, బాలయ్య, రామచంద్రయ్య, శంకర్, గ్రామ ఉద్యోగ బృందం, వివిధ పార్టీల నాయకులు, యువజన, మహిళా సంఘాల ప్రతినిధులు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.