prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 11:11 am Digital Edition : PRAJA VANI

ఇనుగుర్తి మండలంలో గ్రామసభలు

ఇనుగుర్తి మండలంలో గ్రామసభలు..
ప్రజావాణి,ఇనుగుర్తి:మండలంలో గాంధీ జయంతి పురస్కరించుకొని విబీ
జి రాంజీ పై గ్రామ సభలు నిర్వహించారు.మండల కేంద్రం ఇనుగుర్తి తో పాటు అన్ని గ్రామపంచాయతీలలో ఆయా సర్పంచ్ ల ఆధ్వర్యంలో పాలకమండలిలు బాపూజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య ఆశయాలను గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ నిర్వహించిన పాత్రను స్మరించుకున్నారు. పలు గ్రామాలలో జరిగిన గ్రామసభలలో ఎంపీడీవో బండారు పార్థసారథి పాల్గొన్నారు.

*ఇనుగుర్తిలో..*

స్థానిక సర్పంచి తమ్మడపల్లి కుమార్ అధ్యక్షతన గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ పాత్ర ఎప్పటికి మరువలేనిదన్నారు.అనంతరం వి బి బి జి రాంజీ పనులపై గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సత్తూరి యాదగిరి, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

*చిన్ననాగారంలో..*

గ్రామ సర్పంచి చెడుపాక సుజాత యాకయ్య ఆధ్వర్యంలో జిపి పాలకమండలి బాపూజీ 157వ,జయంతి వేడుకలు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం సర్పంచ్ అధ్యక్షతన జరిగిన విబిజి రాంజీ పనులపై ఫీల్డ్ అసిస్టెంట్ గుర్రం సత్యనారాయణ గౌడ్ గ్రామస్తులకు వివరించారు.గ్రామంలో చేపట్టాల్సిన పనులను రైతులు గ్రామస్తులు గుర్తించారు.ఇంకుడు గుంతలు,ఫారం ఫండ్స్, సాగు భూముల వద్దకు వెళ్లడానికి రోడ్ల అభివృద్ధి సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి పిట్టల శేఖర్, వార్డు సభ్యులు బైరు వినయ్ గౌడ్,నడిగంటి చంద్రమౌళి, చెడుపాక సురేష్,మునిగంటి సరిత రాజు,గుండాల మంగమ్మ ధర్మయ్య,చెడుపాక అలివేలు వెంకన్న, ముత్యాల సోమక్క వివిధ పార్టీల నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

కాగా వివిధ గ్రామాలలో వి బి జి రామ్ జీ పథకంలో చేపట్టనున్న పనులపై ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు వివరించారు.గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను గుర్తించారు.రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తమ కావాల్సిన పనులపై అవగాహన పొంది అవసరమైన పనుల కోసం సిఫారసు చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ఉప సర్పంచ్లు,వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు వివిధ పార్టీల నాయకులు ప్రజలు పాల్గొన్నారు.