ఇటుగుళ్లపాడు ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా సరస్వతీ దేవి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు, గ్రామ ప్రజలు సహకరించాలి ఇటుగుళ్లపాడు,అక్టోబర్ 16:ప్రజావాణి వై.ఎస్.ఆర్. కడప జిల్లా, శ్రీ అవధూత కాశినాయన మండలంలోని ఇటుగుళ్లపాడు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం శ్రీ సరస్వతీ దేవి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. విద్యకు, జ్ఞానానికి ప్రతీక అయిన సరస్వతీ దేవి విగ్రహ ప్రతిష్ఠతో పాఠశాల ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంపొందించడం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిలిచింది.గీతం...