ఇటీవల జరుగుతున్న సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
ఇటీవల జరుగుతున్న సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ కే.శ్రీనివాస్ ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామంలో ఈరోజు ఎల్కతుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ,ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు వివిధ రూపాల్లో జరుగుతున్నాయని,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఆన్‌లైన్ లోన్ ఫ్రాడ్స్,పార్ట్‌టైమ్ జాబ్ ఫ్రాడ్స్,ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్, ఫేక్ కస్టమర్ కేర్,ఓటిపి/యూపీఐ మోసాలు,ఫేక్ పోలీస్/డిజిటల్ అరెస్ట్ మోసాలు,సోషల్ మీడియా...