prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 6:29 pm Digital Edition : PRAJA VANI

ఇటీవల జరుగుతున్న సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

ఇటీవల జరుగుతున్న సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ కే.శ్రీనివాస్

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామంలో ఈరోజు ఎల్కతుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ,ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు వివిధ రూపాల్లో జరుగుతున్నాయని,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఆన్‌లైన్ లోన్ ఫ్రాడ్స్,పార్ట్‌టైమ్ జాబ్ ఫ్రాడ్స్,ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్, ఫేక్ కస్టమర్ కేర్,ఓటిపి/యూపీఐ మోసాలు,ఫేక్ పోలీస్/డిజిటల్ అరెస్ట్ మోసాలు,సోషల్ మీడియా మోసాలు తదితర సైబర్ నేరాల గురించి ప్రజలకు వివరించారు.
తెలియని వ్యక్తులు ఫోన్ ద్వారా ఓటిపి,యూపీఐ పిన్,బ్యాంక్ ఖాతా వివరాలు,పాస్‌వర్డ్‌లు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని తెలిపారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం,తెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం చేయవద్దని సూచించారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేసి, cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.