prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 8:50 am Digital Edition : PRAJA VANI

ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివి

*ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివి*

*ఆరుట్లలో మాజీ హోంశాఖ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి 72వ జయంతి వేడుకలు*

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 5 (ప్రజావాణి)ఆరుట్ల: మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి 72వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచాల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వెదిరె హన్మంత్‌రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకుడు కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా నాయకుడు ముచ్చర్ల వెంకటేష్‌యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్వర్గీయ మాజీ హోంశాఖ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి విద్యార్థి దశ నుంచే ఎన్నో ఉద్యమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ రాజకీయంగా ఎదిగి హోంశాఖ మంత్రి స్థాయికి చేరుకుని ప్రజలకు ఎన్నో సేవలు అందించారని పేర్కొన్నారు. ఇంద్రారెడ్డి చేసిన సేవలు మరువలేనివని, ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెరుకు నరసింహగౌడ్, బుట్టి కృష్ణ ముదిరాజ్, మార లక్ష్మణ్, మాజీ సర్పంచ్ అనంగళ్ల యాదయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు రావుల భాష, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్డిమల్ల చంద్రయ్య ముదిరాజ్, కావలి శ్రీనివాస్ ముదిరాజ్, నూకం సత్తయ్య ముదిరాజ్, అంతటి రాజుగౌడ్, మెగావత్ లక్ష్మణ్ నాయక్, దాసరమోని రమేష్ ముదిరాజ్, కావలి రమేష్ ముదిరాజ్, మార సురేష్, ఉదరి నరసింహ, మహమ్మద్ యూసుఫ్, మద్దెల గోపాల్‌గౌడ్, మంకు శ్రీనివాస్, మహమ్మద్ ఇబ్రహీం, సుంకరి దానయ్యగౌడ్, దాసరమోని అశోక్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు..