ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన వేముల మహేష్ గౌడ్
ఘట్‌కేసర్, అక్టోబర్ 5 (ప్రజావాణి): ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్ ఘనపురం గ్రామ పరిధిలోని పకీర్ టేక్య తండాలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలు బానావత్ సక్కుబాయి మన్ను ఇంటి స్లాబ్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద,...