prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 4:18 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన వేముల మహేష్ గౌడ్

ఘట్‌కేసర్, అక్టోబర్ 5 (ప్రజావాణి): ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్ ఘనపురం గ్రామ పరిధిలోని పకీర్ టేక్య తండాలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ సోమవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలు బానావత్ సక్కుబాయి మన్ను ఇంటి స్లాబ్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద, నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతుందని వేముల మహేష్ గౌడ్ పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నానావత్ రూప్‌సింగ్ నాయక్, బద్దం గోపాల్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ వేముల సత్తయ్య గౌడ్‌తో పాటు గ్రామస్తులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.