ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావులేదు.. అర్హతే ప్రామాణికం……అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా అభివృద్ధిలో వివక్ష చూపం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఘట్‌కేసర్, అక్టోబర్ 14 (ప్రజా వాణి) ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావులేదని, అర్హతే ప్రామాణికంగా ఇళ్లను కేటాయిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి వివక్ష చూపడం లేదని పేర్కొన్నారు. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా పోచారంలో బుధవారం ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి...