ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరులో పారదర్శకత
*ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరులో పారదర్శకత – వదంతులను నమ్మవద్దు: మున్సిపల్ కమిషనర్* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 30 (ప్రజావాణి): జనగామ మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు / డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు విషయంలో ఒక లబ్ధిదారురాలి నుంచి రూ.1,00,000/- డిమాండ్ చేసినట్లు వచ్చిన సమాచారంపై మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి వెంటనే స్పందించి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా సంబంధిత లబ్ధిదారురాలిని, మున్సిపల్ సిబ్బందిని విచారించగా, మున్సిపల్ ఉద్యోగులు ఎవరూ తన ఇంటికి రాలేదని, తనను ఎవరూ...