ఇందిరమ్మ ఇల్లు, భూమి విక్రయానికి అనుమతి కోరుతూ హైటెన్షన్ స్తంభం ఎక్కి నిరసన
అధికారుల హామీతో స్తంభం దిగిన రవీందర్
బెజ్జంకి, అక్టోబర్ 9 (ప్రజావాణి)
ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాకపోవడం, అప్పులు, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామానికి చెందిన రవీందర్ హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి నిరసనకు దిగాడు.తన పట్టా భూమిని విక్రయించేందుకు తహసీల్దార్ అనుమతి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు స్తంభం దిగనని పట్టుబట్టాడు.సమాచారం అందుకున్న బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి, స్థానిక సర్పంచ్ బొల్లం శ్రీధర్ సంఘటనా స్థలానికి చేరుకుని రవీందర్‌తో మాట్లాడారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు కృషి చేయడంతో పాటు, అప్పులు తీర్చుకునేందుకు భూమి విక్రయానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రవీందర్ నిరసన విరమించి హైటెన్షన్ విద్యుత్ స్తంభం నుంచి కిందకు దిగివచ్చాడు.