prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 2:46 pm Digital Edition : PRAJA VANI

ఇందిరమ్మ ఇల్లు బిల్లులు రాక… పురుగులు మందు డబ్బా తో నిరసన

ఇందిరమ్మ ఇల్లు బిల్లులు రాక… పురుగులు మందు డబ్బా తో నిరసన

బిల్లుల కోసం పలుమార్లు విన్నవించినా స్పందన లేదని ఆవేదన.

ఎంపీడీఓ కార్యాలయం ముందు బాధితులు పురుగుల మందు డబ్బా తో నిరసన.

వీర్నపల్లి, ప్రజావాణి

విర్నపెల్లి మండలంలోని గోన్య నాయక్ తండాకు చెందిన బట్టు రోజా మాన్య నాయక్‌కు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అయితే ఇంటి నిర్మాణం ప్రారంభ దశలో బేస్‌మెంట్ బిల్లు రెండుసార్లు డిపాజిట్ కావడంతో అధికారులు బిల్లును హోల్డ్‌లో పెట్టినట్లు బాధితురాలు తెలిపారు.
ఇప్పటికే ఇంటి గోడలు, స్లాబ్ నిర్మాణం పూర్తయినా తదుపరి బిల్లు ఇప్పటివరకు విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల కోసం కలెక్టర్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.

అప్పుల బాధతో ఆందోళన

ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేసి, బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని బాధితురాలు పేర్కొన్నారు. అధికారులు తన సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వీర్నపల్లి మండల ప్రజావాణి కార్యక్రమానికి పురుగుల మందు డబ్బాతో వచ్చి నిరసన తెలిపారు.

అధికారులు స్పందించాలని వేడుకోలు

ఇందిరమ్మ ఇంటి బిల్లును వెంటనే పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న బిల్లును విడుదల చేసి తనకు న్యాయం చేయాలని బాధితురాలు అధికారులను వేడుకున్నారు.