prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 9:30 pm Digital Edition : PRAJA VANI

ఇండ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలి

ఇండ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలి..
ప్రజవాణి,నెల్లికుదురు: నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ఇనుగుర్తి మండలం మునిగలవీడు సర్పంచి బొల్లి కొండ చైతన్య నాగరాజు సూచించారు. మండలంలోని మునిగేలవేడు గ్రామంలో తన ఇంటి స్లాబ్ నిర్మాణ పనులను ఇందిరమ్మ కమిటీ సభ్యుల తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించి ముందుకు సాగుతోందన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇంట్లో అరకులందరికీ మంజూరు చేయిస్తామనితెలిపారు.
కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాజు యాదవ్, శ్రీరంగం శ్రీనివాస్,భూక్యా దేవినవీన్, ఇస్సంపల్లి రాములు,ఉపేందర్, బొల్లికొండ పెద్దవెంకటయ్య,చిన్న వెంకటయ్య,బాలరాజు, రాజశేఖర్, బొజ్జ రాములు గడ్డమీది వెంకటయ్య, మురగుండ్ల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.