ఇండియా కూటమి ఆధ్వర్యంలో జనగామలో భారీ ర్యాలీ
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలి: ఇండియా కూటమి నాయకులు
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 06(ప్రజావాణి): “సేవ్ డెమోక్రసీ వీక్ – ఓటు బచావో , దేశ్ బచావో ” కార్యక్రమాల్లో భాగంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో మంగళవారం జనగామ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జనగామ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, టీపీసీసీ ఇన్‌చార్జ్ సచిన్ సావంత్ , జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి , వైటిడిఏ మెంబర్, టీపీసీసీ సభ్యులు డా. లక్ష్మీనారాయణ నాయక్ , ఎస్ఎస్ఏ రాష్ట్ర చైర్మెన్ గంప వేణు గోపాల్ , స్టేషన్ ఘనపూర్ ఎస్ఐఆర్ ఇన్‌చార్జ్ దుద్ధిల్ల శ్రీనుబాబు , జనగామ మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, సీపీఐ, టీజేఎస్, సమాజ్‌వాదీ పార్టీ తదితర పార్టీల నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.
ఓటు చోరీపై రాహుల్ గాంధీ ముందుగానే ప్రజలను అప్రమత్తం చేశారు: సచిన్ సావంత్
ఈ సందర్భంగా శ్రీ సచిన్ సావంత్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది అని, ప్రతి అర్హత కలిగిన పౌరుడి ఓటు సురక్షితంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఓటు చోరీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, ఓటర్ల జాబితాలు, ఓటర్ల తొలగింపు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై ప్రజల్లో అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
“ప్రజల ఓట్లను దొంగిలించే ప్రభుత్వంగా మోదీ ప్రభుత్వం మారిందని” ఆయన తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఈ అంశాన్ని ముందుగానే గుర్తించి దేశ ప్రజలకు అర్థమయ్యేలా వివరించారని తెలిపారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు, డూప్లికేట్ ఓటర్లు, చెల్లని చిరునామాలు వంటి అంశాలపై రాహుల్ గాంధీ గారు ప్రజల దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.
డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ… దేశంలో జరుగుతున్న ఓటు చోరీ ఆరోపణలపై బీజేపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటర్ల హక్కులను, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ… దేశ ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జనగామ జిల్లా ఇంచార్జీ ఎండి అబ్బాస్ మాట్లాడుతూ సిఈసి జ్ఞానేశ్ కుమార్ చేసిన తప్పిదాలకు అమాయక ప్రజల ఓట్లు తీసివేసే పరిస్థితి రావడం దారుణమని, రానున్న రోజుల్లో ఇండియా కూటమి పాలనలో ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు.
సీపీఐ నేత సాయన్న మాట్లాడుతూ ఓటు చోరీపై బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ తరఫున డీసీసీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చంద్ర రెడ్డి, కొత్త కరుణాకర్ రెడ్డి, నూకల బాల్రెడ్డి, కీసర దిలీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వేమల్ల సత్యనారాయణ రెడ్డి, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు SC సెల్ వేముల మల్లేష్, మహిళా కాంగ్రెస్ బడికే ఇందిరా, మైనార్టీ సెల్ మాజిద్ అప్సర్, కిసాన్ సెల్ పిన్నింటి నారాయణరెడ్డి, సేవాదళ్ జాయా మల్లేష్, పట్టణ అధ్యక్షులు దోర్నాల వెంకటేశ్వర్లు, అంబటి కిషోర్, మండల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, వగలబోయిన యాదగిరి, మసూద్, మనోహర్, రావుల భిక్షపతి, జూలకంటి శిరీష్ రెడ్డి, గాదె మనోహర్ రెడ్డి, ఐలయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శులు జిల్లెళ్ల సిద్ధారెడ్డి, భాస్కర్, మేడ శ్రీనివాస్, స్పోక్ పర్సన్ లు నరేంద్ర పవర్, జక్కుల వేణు, బెలిదే వెంకన్న, ఆర్టిఏ మెంబర్ అభి గౌడ్, మేకల సమ్మయ్య, ఎదునూరి రవీందర్, జొన్నగాని కిష్టయ్య, అర్జుల సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) తరఫున మోకు కనకారెడ్డి, రాపర్తి రాజు, ఇర్రి అహల్య, బోట్ల శేఖర్, సింగారపు రమేష్, జోగు ప్రకాష్, బూడిద గోపి, సుంచు విజయేందర్, రమేష్, అజరుద్దీన్, నరేంద్ర తదితరులు, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ తరఫున జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజు సాంబయ్య, కళింగ రాజు, జీడి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.