prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 7:08 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఇంజనీర్స్ డే సందర్భంగా రవికుమార్ యాదవ్‌కు ఘట్కేసర్ లయన్స్ క్లబ్ అభినందనలు

ఘట్కేసర్, సెప్టెంబర్ 30 (ప్రజావాణి): లయన్స్ ఇంటర్నేషనల్ 320ఎఫ్ జిల్లా ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమం సెప్టెంబర్ 30న హనుమకొండలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 320ఎఫ్ జిల్లా పరిధిలోని వివిధ లయన్స్ క్లబ్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఘట్కేసర్ లయన్స్ క్లబ్‌కు చెందిన క్లబ్ ట్రెజరర్ వేల్పుల రవికుమార్ యాదవ్ (సీనియర్ సెక్షన్ ఇంజనీర్, సౌత్ సెంట్రల్ రైల్వే) ఇంజనీర్స్ డేగా ఎంపికైన సందర్భంగా ఘట్కేసర్ లయన్స్ క్లబ్ సభ్యులు అభినందనలు తెలిపారు.

ఘట్కేసర్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రేసు లక్ష్మారెడ్డి, సెక్రటరీ బచ్చు నగేష్ కుమార్ గుప్తా, చార్టర్డ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్తో పాటు క్లబ్ సభ్యులు రవికుమార్ యాదవ్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రెసిడెంట్ రేసు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రవికుమార్ యాదవ్ మరిన్ని ఉన్నత సన్మానాలు, పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఇంజనీరింగ్ రంగంలో ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.