prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 9:53 am Digital Edition : PRAJA VANI

ఆరోగ్య జీవితానికి ప్రకృతి వ్యవసాయం: ఎంఏవో యాస్మిన్

ఆరోగ్య జీవితానికి ప్రకృతి వ్యవసాయం: ఎంఏవో యాస్మిన్
ప్రజావాణి,ఇనుగుర్తి: మానవాళి ఆరోగ్యవంతమైన జీవితానికి ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలు చేస్తుందని మండల వ్యవసాయ అధికారి షేక్ యాస్మిన్ తెలిపారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం లో భాగంగా ఇనుగుర్తి రైతు వేదికలో రైతులకు ఆర్గానిక్ సాగుపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రసాయన ఎరువులు,పురుగుమందులు వాడటం వలన కలిగే నష్టాల గురించి ఎం ఏ ఓ వివరించారు. రైతులు తమకున్న వ్యవసాయ క్షేత్రంలో ఒక రైతు ఒక ఎకరం చొప్పున ప్రకృతి వనరులను ఉపయోగించి జీవామృతం,కషాయాల తయారీ చేసుకుని సేంద్రీయ వ్యవసాయం చేయాలని సూచించారు. దీంతో పర్యావరణానికి చాలా మేలు చేకూరుతుందన్నారు.మానవాళి హెల్త్ కు సహజ సాగు ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రకృతి సాగు తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం స్థానిక రైతు యాకూబ్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో జీవామృతం, కషాయాల తయారీపై రైతులకు శిక్షణ తో కూడిన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈఓ భాస్కర్,ప్రాజెక్టు ఇంచార్జి సుష్మ రైతులు పాల్గొన్నారు.