prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 12:22 pm Digital Edition : PRAJA VANI

ఆరోగ్యం బాగోలేక హైదరాబాద్ హాస్పిటల్ లో ఉన్న గన్నేటి సీతయ్య కి సచివాలయం సిబ్బంది వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వడం జరిగింది

ఆరోగ్యం బాగోలేక హైదరాబాద్ హాస్పిటల్ లో ఉన్న గన్నేటి సీతయ్య కి సచివాలయం సిబ్బంది వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వడం జరిగింది

ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం అక్టోబర్ 4

పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కూనవరం గ్రామం స్వర్ణ గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది పనితీరు బేస్ కూనవరం గ్రామానికి చెందిన గర్నేటి సీతయ్య వయసు 75 సంవత్సరాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండడం వలన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రెండు నెలల్లో నుంచి తీసుకోలేకపోయారు పెన్షన్ మూడు నెలలు తీసుకోకపోతే పెన్షన్ క్యాన్సిల్ అవడం జరుగుతుంది. తక్షణమే ఈనెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పూర్తిగా రెండునెలలు డబ్బులను తెలంగాణ హైదరాబాద్ వెళ్లి సచివాలయ సిబ్బంది కూనవరం డిజిటల్ అసిస్టెంట్ వీరాస్వామి సర్వేర్ అప్పారావు హైదరాబాద్ వెళ్లి గర్నేటి సీతయ్య కి రెండు నెలల పెన్షన్ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం ద్వారా ఒకటవ తారీఖునే ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలోని స్వర్ణ గ్రామం వార్డు సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే ఇవ్వడమే కాకుండా పక్క రాష్ట్రం తెలంగాణలో అనారోగ్యంతో ఉన్న వారికి కూడా తమ వంతు విధులను నిర్వహించి పెన్షన్ అందించడం జరిగింది