ఆరుట్ల సర్పంచ్‌కు అవమానమా

*ఆరుట్ల సర్పంచ్‌కు అవమానమా?* *జాతర సమీక్ష సమావేశానికి సమాచారం ఇవ్వకపోవడంపై అఖిలపక్షం ఆగ్రహం* *గ్రామపంచాయతీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం.. సర్పంచ్‌కు గౌరవం ఇవ్వాలని డిమాండ్‌* మంచాల, అక్టోబర్ 29 (ప్రజావాణి): మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మానిపాటి శోభాకుమార్, ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆరుట్ల గ్రామంలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి జాతర ఏర్పాట్లపై ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి గ్రామ సర్పంచ్‌తో పాటు గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడంపై ఈ సమావేశంలో పలువురు...