prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 9:48 pm Digital Edition : PRAJA VANI

ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ పాఠశాలను సందర్శించిన మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి

*ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ పాఠశాలను సందర్శించిన మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి*

*కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా పాఠశాల నిర్మాణం అద్భుతం: మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి*

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 28 (ప్రజావాణి):మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ పాఠశాలను తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ చైర్మన్, మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి, ప్రొఫెసర్ జలంధర్ రెడ్డి, వారి బృందం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణమంతా కలియతిరిగి, అక్కడి సౌకర్యాలు, తరగతి గదులు, క్రీడా మైదానాలు, పాఠశాల నిర్వహణ తీరును పరిశీలించారు.

అనంతరం మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి మాట్లాడుతూ, ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ పాఠశాల నిర్మాణం కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలతో ఎంతో అద్భుతంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో విద్యనభ్యసించే ప్రాంత విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పాఠశాలలోని ఆహ్లాదకరమైన వాతావరణం, చక్కటి సౌకర్యాలు, మెరుగైన నిర్వహణ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ఇలాంటి పాఠశాలలో చదువుకునే విద్యార్థులు నిజంగా అదృష్టవంతులని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
*
ఈ కార్యక్రమంలో తెలంగాణ పబ్లిక్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్ధగోని గిరిధర్ గౌడ్, తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ జలవర్ష రాములు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్ గౌడ్, పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, ప్రజాగలం దామర భూపాల్ తదితరులు పాల్గొన్నారు.