ఆరుట్ల కూరగాయల మార్కెట్‌లో రైతులతో సమావేశం

*ఆరుట్ల కూరగాయల మార్కెట్‌లో రైతులతో సమావేశం* *రైతులందరూ మార్కెట్‌లోనే కూరగాయలు విక్రయించాలి* *రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాం: మంచాల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వెదిరె హన్మంత్ రెడ్డి* మంచాల, అక్టోబర్ 29( ప్రజావాణి): మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను మంచాల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వెదిరె హన్మంత్ రెడ్డి సందర్శించి, కూరగాయలు విక్రయించే రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మానిపాటి శోభాకుమార్, ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు చెరుకు...