prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 5:21 pm Digital Edition : PRAJA VANI

ఆరుట్లలో భార్గవి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్‌షాప్ ప్రారంభం

*ఆరుట్లలో భార్గవి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్‌షాప్ ప్రారంభం*

– **ప్రారంభోత్సవంలో పాల్గొన్న గ్రామ ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కావలి శ్రీనివాస్ ముదిరాజ్, వైయస్సార్ మాధగోని జంగయ్య గౌడ్*

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంచాల మండలం, అక్టోబర్ 12 (ప్రజావాణి): ఆరుట్ల గ్రామంలో స్వయం ఉపాధిలో భాగంగా చెన్నమోని శంకర్ ముదిరాజ్ దంపతులు ఏర్పాటు చేసిన భార్గవి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్‌షాప్‌ను గ్రామ ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, ముదిరాజ్ సంఘం పెద్దలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్ మాట్లాడుతూ, గ్రామాల్లో ఎంబ్రాయిడరీ వంటి కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. గతంలో ఎంబ్రాయిడరీ పనులు చేయించుకోవాలంటే హైదరాబాద్ నగరానికి వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం ఆరుట్ల గ్రామంలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయని పేర్కొన్నారు. గ్రామంలోనే ఇలాంటి స్వయం ఉపాధి కేంద్రాలు ఏర్పాటవడం వల్ల స్థానిక ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

భార్గవి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేసిన చెన్నమోని శంకర్ ముదిరాజ్ దంపతులు వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ వారికి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నూకం సత్తయ్య ముదిరాజ్, గుడ్డిమల్ల చంద్రయ్య ముదిరాజ్, మానిపాటి కుమార్, వైయస్సార్ మాధగోని జంగయ్య గౌడ్, ఆరుట్ల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కావలి శ్రీనివాస్ ముదిరాజ్, నూకం బాలయ్య, శేఖర్ ముదిరాజ్, దాసరమోని రమేష్ ముదిరాజ్, బుట్టి జంగయ్య ముదిరాజ్, తలారి కృష్ణ ముదిరాజ్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు బుట్టి కృష్ణ ముదిరాజ్, గుడ్డిమల్ల రాజు ముదిరాజ్, శంకర్ ముదిరాజ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.