prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 4:27 pm Digital Edition : PRAJA VANI

ఆరుట్లలో దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ.. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

*ఆరుట్లలో దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ.. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం*

*దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేసిన గ్రామ ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులు*

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అక్టోబర్11 (ప్రజావాణి): ఆరుట్ల గ్రామంలో వేణుగోపాలస్వామి భజన మండలి ఆధ్వర్యంలో దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. డప్పుచప్పుళ్ల నడుమ దుర్గాదేవికి సంబంధించిన చీర, ముక్కుపుడకను ఊరేగింపుగా వేణుగోపాలస్వామి భజన మండలి మండపం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం అమ్మవారిని అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది.

అనంతరం గ్రామ ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, వార్డు సభ్యులు మాడుగుల బాలమణి, కృష్ణగౌడ్, మొర్రి పద్మ, ఐలయ్య, వైఎస్సార్, మాధగోని జంగయ్య గౌడ్ తదితరులు దుర్గాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వేణుగోపాలస్వామి భజన మండలి సభ్యులు, యువకులు, భక్తులు, గ్రామపెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల ప్రారంభంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.