*ఆరుట్లలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు*
*దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీర్ల రమేష్, గ్రామ సర్పంచ్ మానిపాటి శోభాకుమార్
*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 12 (ప్రజావాణి):మంచాల మండలం, ఆరుట్ల గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సాయి మేస్త్రీ అసోసియేషన్, వేణుగోపాలస్వామి భజన మండలి, జై భవాని యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి అమ్మవారిని మంచాల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చీర్ల రమేష్, గ్రామ సర్పంచ్ మానిపాటి శోభాకుమార్, ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాండాల జంగయ్య గౌడ్, పున్నం రాము, భాను, చిందం రఘుపతి, చిందం జంగయ్య, మాడుగుల కృష్ణ గౌడ్, మొర్రి ఐలయ్య, చిందం వెంకటేష్ (స్టీల్), కురుమ సంఘం అధ్యక్షుడు రావుల భాషయ్య, చిందం యాదయ్య, చెరుకు రామచంద్రయ్య, నూకం బాలరాజు ముదిరాజ్, రావుల రాఘవ, మాడుగుల బుచ్చయ్య గౌడ్, ఆర్ల శ్రీనివాస్, చెరుకు శ్రీశైలం, గుడ్డిమల్ల రాజు ముదిరాజ్, జ్ఞానేశ్వర్ రెడ్డి, కిషోర్ రెడ్డి, ఆర్ల యాదయ్య, చిందం ఐలయ్య, గొరిగె పాండు, కొండూరు మల్లేష్, చెరుకు రాజు, శంకర్ స్వామి, రావుల బీరప్ప, మొర్రి శ్రీశైలం, ఆర్ల శ్రీకాంత్, గొరిగె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.