*ఆరుట్లలో ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ*
*అర్హులైన వారందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు,*
*పింఛన్లు మంజూరు చేయిస్తాం: ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతిరి ఎల్లేష్
మంచాల, అక్టోబర్ 17 (ప్రజావాణి): మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన సంక్షేమ పథకాల్లో భాగంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డులను ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి చిందం శ్రీశైలం, ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెరుకు నరసింహగౌడ్, బుట్టి కృష్ణ ముదిరాజ్, కోరే బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతిరి ఎల్లేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రజాపాలన కొనసాగిస్తోందని తెలిపారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
*
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సహకారంతో అర్హులైన పేద ప్రజలందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని సాతిరి ఎల్లేష్ అన్నారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుడ్డిమల్ల చంద్రయ్య ముదిరాజ్, జిల్లా నాయకుడు మార సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరమోని రమేష్ ముదిరాజ్, రావుల నాగరాజు, పంబాల శివకుమార్, కిషోర్, మైనారిటీ నాయకుడు మహమ్మద్ అష్రఫ్, జిలమోని శ్రీనివాస్ ముదిరాజ్, స్మార్ట్ రేషన్ కార్డుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.