ఆపదలో ఉన్న మహిళకు రక్తదానం చేసిన తిరుపతి
ఆపదలో ఉన్న మహిళకు రక్తదానం చేసిన తిరుపతి బెజ్జంకి, అక్టోబర్ 8 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ గుండె సంబంధిత సమస్యతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శుక్రవారం ఆమెకు ఆపరేషన్ నిర్వహించనున్న నేపథ్యంలో రక్తం అవసరం ఏర్పడింది. దీంతో మహిళ కుటుంబ సభ్యులు చిలాపూర్ గ్రామానికి చెందిన భాస్కరాచారి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు శనగొండ శ్రవణ్ కుమార్‌ను సంప్రదించారు.వెంటనే స్పందించిన శ్రవణ్ కుమార్, ఎరవెల్లివాడ గ్రామానికి చెందిన తిరుపతితో మాట్లాడి అవసరమైన రక్తాన్ని...