prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 3:10 pm Digital Edition : PRAJA VANI

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా సి ఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేత

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా సి ఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేత

మద్దూరు అక్టోబర్3, ప్రజా వాణి,

సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని దుబ్బతండా గ్రామపంచాయతీకి చెందిన లకావత్ రాధికకు ముఖ్యమంత్రి సహాయనిధి (సి ఎం ఆర్ ఎఫ్) ద్వారా రూ.60,000/- ఆర్థిక సహాయం మంజూరు చేయించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి
కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్ పి టి సి గిరి కొండల్ రెడ్డి సహకారంతో మంజూరైన సి ఎం ఆర్ ఎఫ్ సహాయాన్ని, ధూళిమిట్ట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్ ఆదేశానుసారం,జనగామ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూక్య రాజేష్ రాథోడ్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు ధరావత్ తిరుపతి గారు బాధిత కుటుంబానికి అందజేశారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని, అవసరమైన సమయంలో సహాయ సహకారాలు అందిస్తూ కుటుంబానికి తోడుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.ఈ ఆర్థిక సహాయం అందించినందుకు బాధిత కుటుంబ సభ్యులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి,గిరి కొండల్ రెడ్డి,బండి శ్రీనివాస్ గౌడ్,భూక్య రాజేష్ రాథోడ్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.