ఆత్మశుద్ధి.. సన్మార్గ సాధనే భవాని దీక్ష

ఆత్మశుద్ధి.. సన్మార్గ సాధనే భవాని దీక్ష పోత్కపల్లిలో భక్తిశ్రద్ధలతో భవాని మాలధారణ.. సుమారు 40 మంది భక్తులు దీక్ష స్వీకరణ ఆధ్యాత్మిక చింతనతో ఆత్మశుద్ధి సాధించి, సన్మార్గంలో పయనించేందుకు భవాని దీక్ష ఎంతో దోహదపడుతుందని భక్తుల విశ్వాసం. దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో భక్తులు భవాని మాలధారణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 40 మంది భక్తులు భవాని మాలలు ధరించి దీక్షను స్వీకరించారు. దుర్గామాతను భక్తితో ఆరాధిస్తూ, నియమ నిష్ఠలతో దీక్షను కొనసాగించేందుకు భక్తులు...