ఆడబిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట..
ఎమ్మెల్యే డా.మురళి నాయక్
ప్రజావాణి,నెల్లికుదురు: సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ అన్నారు. మండల కేంద్రం నెల్లికుదురు రైతులేదికలో శనివారం కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మహిళలకు జీరో వడ్డీ రుణాలు, ఫ్రీ బస్సు ప్రయాణం, కళ్యాణ లక్ష్మి వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు.అర్హులైన 76 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున రూ.7,608,816 విలువైన కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులు అందజేశార. 54 మంది లబ్ధిదారులకు 1,689,000 సిఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రజాప్రతినిధులు,అధికారులతో కలిసి ఎమ్మెల్యే డా మురళి నాయక్ పంపిణీ చేశారు.కళ్యాణ లక్ష్మి,సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేసిన సిఎం రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే డా. మురళీ నాయక్ కు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ చందా నరేష్, ఎంపీడీవో సింగారపు కుమార్ వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల,జిల్లా,గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు అధికారులు.పాల్గొన్నారు.