ఆటో మీటర్ చార్జీల పెంపుపై హర్షం.. సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం
మేడ్చల్: మేడ్చల్ డివిజన్ 297 అంబేద్కర్ ఆటో స్టాండ్‌లో ఐఎన్టియుసి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు ఆటో డ్రైవర్లు పాలాభిషేకం నిర్వహించారు. ఆటో మీటర్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. కిలోమీటరుకు రూ.30 చొప్పున చార్జీ పెంపు నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆటో డ్రైవర్లకు నెలకు రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇవ్వడాన్ని స్వాగతించారు....