prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 5:44 pm Digital Edition : PRAJA VANI

ఆటో డ్రైవర్ కుటుంబానికి పోలీస్ ఆపన్న హస్తం

ఆటో డ్రైవర్ కుటుంబానికి పోలీస్ ఆపన్న హస్తం

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన మృతుడు జంగం రాజు ఆటోడ్రైవర్ 19 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందినాడు.అతనికి ఇద్దరు పిల్లలు,మూడు సంవత్సరాలు ఒక పాప,సంవత్సర ఒక బాబు.మృతుడు జంగం రాజు కిడ్నీలు ఇతర అనారోగ్యం సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.వారి ఆర్థిక పరిస్థితి కూలి చేసుకుంటే గడవదు. విషయాన్ని తెలుసుకున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ టౌన్ లో పనిచేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆలీ మహమ్మద్,శనివారం మృతుని కుటుంబాన్ని, భార్యాపిల్లను పరామర్శించి ధైర్యం చెప్పివాళ్లకు మూడు వేల రూపాయల నిత్యవసర వస్తువులు అందించడం జరిగింది.దాతలు ఇంకెవరైనా ఆదుకుంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని విజ్ఞప్తి చేశారు.