prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 6:24 pm Digital Edition : MAHESH MEDCHAL

ఆటో కార్మికుల సంక్షేమానికి అండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఆటో కార్మికుల సంక్షేమానికి అండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఎల్లమ్మ, కట్ట మైసమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

మేడ్చల్: మేడ్చల్ 297వ డివిజన్ పరిధిలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ, కట్ట మైసమ్మ దేవతలకు నిర్వహించిన పూజా కార్యక్రమానికి ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్నగారి రాఘవేందర్ గౌడ్, మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాఘవేందర్ గౌడ్, చీర్ల రమేష్ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తమ వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కష్టపడి పనిచేస్తూ ప్రజలకు రవాణా సేవలు అందిస్తున్న ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాలపై ఎల్లమ్మ తల్లి, కట్ట మైసమ్మ దేవతల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.

సమాజంలో రవాణా రంగానికి ఆటో కార్మికులు అందిస్తున్న సేవలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎర్ర విజయ రావు, యూనియన్ ప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆటో కార్మికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.